“సలార్” లీక్ సీన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా.?

Published on Jul 6, 2021 7:52 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి ఒక అవుట్ అండ్ అండ్ మాస్ ప్రాజెక్ట్ పడితే ఎలా ఉండబోతుందో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” తో రుచి చూపించనున్నారు. అయితే ఈ భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పై భారీ స్థాయి అంచనాలే నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి కూడా బయటకి కొన్ని లీక్స్ బయటకి వచ్చేసాయి. అలా ఇటీవల కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఒక బైక్ పై ప్రభాస్ కనిపిస్తూ ఉన్నాడు అందులో.. మరి ఆ సీక్వెన్స్ పైనే ఆసక్తికర టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. అది ఈ సినిమాలో ఒక స్పెషల్ గా అండ్ సాలిడ్ గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంట.

అలాగే అలాని కొన్ని సీక్వెన్స్ లు కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేక బైక్స్ కూడా రెడీ చేయించాడని అదే ఆ సీన్ లో కనిపించింది కూడా అని గాసిప్స్.. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబేలె పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :