ఇంట్రెస్టింగ్.. వీక్ డేస్ లో కూడా ‘నాగ బంధం’ ట్రెండింగ్!

ఇంట్రెస్టింగ్.. వీక్ డేస్ లో కూడా ‘నాగ బంధం’ ట్రెండింగ్!

Published on Jul 7, 2026 11:05 AM IST

Nagabandham Review

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో భారీ చిత్రం ‘నాగ బంధం’ కూడా ఒకటి. యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్ గా దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ భారీ స్కేల్ డివోషనల్ డ్రామా విడుదలకి ముందు మంచి బజ్ ని సొంతం చేసుకుంది. ఇలా థియేటర్స్ లోకి సాలిడ్ బుకింగ్స్ తోనే వచ్చిన ఈ సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గా అందుకుంది.

ఈ నేపథ్యంలో సినిమా రన్ వీకెండ్ కి అయిపోతుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా రన్ వీక్ డేస్ లో కూడా కొనసాగుతుంది. బుక్ మై షో టికెట్ సేల్స్ ట్రెండింగ్ లో ఈ సినిమా మంగళవారం కూడా కనిపించడం గమనార్హం. దీనితో మరీ తక్కువ అంచనా వేసినవారికి నాగ బంధం ఊహించని సమాధానమే ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంకి ఇక ఈ సినిమాకి జునైద్ కుమార్, అభే లు సంగీతం అందించగా కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు