అరవింద తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ !

Published on Oct 6, 2018 12:00 pm IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. ఈ చిత్రం అనుకున్న విధంగా విడుదల అవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఎన్టీఆర్ విశ్రాంతి లేకుండా షూటింగ్ ని పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక, తారక్ నెలరోజులు పాటు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఆ తరువాత రాజమౌళి చిత్రానికి ఫుల్ డేట్స్ కేటాయించనున్నాడు.

ఇక ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ నటిస్తున్నాడని, అలాగే ఎన్టీఆర్‌ ఇటు తండ్రిపాత్రలోనూ.. అటు కొడుకు పాత్రలోనూ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి. వీటిల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్రం విడుదల తేదీ వరకు ఆగాల్సిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :