ప్రభాస్ ‘ఆదిపురుష్’లో క్రేజీ సీక్వెన్స్ !

Published on Mar 19, 2023 10:22 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య భారీగా తెరకెక్కుతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా రాబోతుంది. ఐతే, ఈ సినిమాలో రాముడి పాత్ర యొక్క స్వభావాన్ని చెప్పడానికి ఓం రౌత్ ఓ క్రేజీ సీక్వెన్స్ ను డిజైన్ చేశాడట. ఈ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటుందని.. పైగా రాముడి గురించి ఎవరికీ తెలియని కొత్త కోణాన్ని ఈ సిక్వెన్స్ చూపిస్తోంది అని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కోసం ప్రభాస్‌ చాలా సవాళ్లను ఫేస్‌ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారు.

ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్‌ శిక్షణ కూడా తీసుకున్నారు. పైగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటుంది. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ఆ షేప్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. అన్నట్టు రాముడి పాత్ర యొక్క ఆలోచనా విధానాన్ని చెప్పడానికి మేకర్స్ రెండు పేజీల ఓ భారీ డైలాగ్ ను రాశారట. ప్రభాస్ తన కెరీర్ లోనే అంత పెద్ద డైలాగ్ ను ఇంతవరకూ ఏ సినిమాలో చెప్పలేదు, మరి ఈ డైలాగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :