‘రాధేశ్యామ్’పై లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్.!

Published on Jul 3, 2021 2:11 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. క‌రోనా కారణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందనే చెప్పాలి. అయితే అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది.

ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో నటిస్తున్నాడని, పరమహంస పాత్రలో ఆయన దర్శనమివ్వనున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని సీన్ల షూట్‌లో కృష్ణంరాజు పాల్గొంటున్నాడని టాక్. అయితే రెబల్ స్టార్, యంగ్ రెబ‌ల్ స్టార్లు ఇద్ద‌రూ మ‌రోసారి స్క్రీన్ పై మెరువ‌నున్నార‌న్నది పక్కన పెడితే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీగా వస్తున్న సినిమాలో కృష్ణంరాజును దర్శకుడు రాధాకృష్ణ ఎలా చూపించబోతున్నారు, ఎలాంటి క్యారెక్టర్ ఆయనకు ఇచ్చారన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది.

సంబంధిత సమాచారం :