ఇంట్రెస్టింగ్..రజినీ రీ రిలీజ్ కి కొత్త క్లైమాక్స్..?

ఇంట్రెస్టింగ్..రజినీ రీ రిలీజ్ కి కొత్త క్లైమాక్స్..?

Published on Nov 23, 2022 12:45 PM IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో పలు చిత్రాలు సరిగ్గా ఆదరణ అందుకోనప్పటికీ ఆడియెన్స్ లో మాత్రం మంచి స్థానాన్ని తెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. మరి అలాంటి చిత్రాల్లో డైరెక్టర్ సురేష్ కృష్ణ తో చేసిన ఓ స్టైలిష్ అండ్ డివోషనల్ చిత్రం “బాబా” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం గత రెండు దశాబ్దాల కితం రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.

కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇందులో మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ చిత్రంలో మొదటి క్లైమాక్స్ కాకుండా కొత్త క్లైమాక్స్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం బయటకి రావాల్సి ఉంది. ఈ చిత్రంకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా ఈ డిసెంబర్ 12న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు