ఓటిటిలో “గుంటూరు కారం” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్..

ఓటిటిలో “గుంటూరు కారం” కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్..

Published on Feb 10, 2024 8:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మాస్ అండ్ క్లాస్ చిత్రం “గుంటూరు కారం”. మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో కాస్త మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ భారీ వసూళ్ళని రీజనల్ గా అందుకొని అదరగొట్టింది. మరి ఈ చిత్రం నిన్నటి నుంచే ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు ఇందులో కూడా ఈ చిత్రానికి మిక్స్డ్ స్పందన వస్తుండడం గమనార్హం. అయితే ఈసారి సినిమాలో కంటెంట్ పరంగా కాదు డబ్బింగ్ విషయంలో వ్యూవర్స్ నుంచి వస్తుంది. మెయిన్ గా మాస్ సాంగ్ కుర్చీ మడతపెట్టి ఇతర భాషలు డబ్బింగ్ వెర్షన్ అయితే వెరైటీగా ఉందంటున్నారు.

ఇక అలాగే కొన్ని సీన్స్ కి తెలుగు నుంచి హిందీ, తమిళ్ వెర్షన్ లో చేసిన మార్పులు కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయని ఫ్యాన్స్ నోటిస్ చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా థమన్ మ్యూజిక్ కి, త్రివిక్రమ్ కొన్ని డైలాగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ ఇప్పుడు అందిస్తున్నారు. ఇలా ఓవరాల్ గా ఓటిటిలో వచ్చాక మాత్రం గుంటూరు కారం బెటర్ రెస్పాన్స్ నే ఆడియెన్స్ నుంచి అందుకుంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు