వాళ్లిద్దరూ అలా కలిశారో లేదో ఇలా రూమర్ మొదలుపెట్టేశారు.

Published on Jul 14, 2019 10:42 am IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తను నటించిన “డియర్ కామ్రేడ్” మూవీ ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. సౌత్ ఇండియా అన్ని ప్రధాన భాషలలో విడుదలవుతున్న ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆయా రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో మ్యూజిక్ షోలు నిర్వహిస్తూ తన చిత్రాన్ని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మొన్న బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా “కెజిఎఫ్” స్టార్ యష్ హాజరై కన్నడ ట్రైలర్ ని విడుదల చేయడంతో పాటు,వేదికపై సందడి చేశారు.

ఐతే ఈ ఇద్దరు క్రేజీ స్టార్స్అలా కలిసారో లేదో ఇలా ఇండస్ట్రీలో ఒక పుకారు మొదలుపెట్టేశారు. అదేమిటంటే “కెజిఎఫ్” మూవీకి కొనసాగింపుగా వస్తున్న “కెజిఎఫ్ 2” మూవీలో విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఫాన్ ఇండియా మూవీ గా అన్ని భాషలలో విడుదల కానున్న ఈ సెన్సేషనల్ చిత్రంలో అన్ని ఇండస్ట్రీస్ కి చెందిన నటులను తీసుకోవడం వలన మూవీకి అడ్వాంటేజ్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే తెలుగు పరిశ్రమకు చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేత ఓ కీలక పాత్ర చేయయించడం మంచిదని వారి ఆలోచనట. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు అప్పుడే రాద్ధాంతం మొదలు పెట్టేశాయి.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే కెజిఎఫ్ 2 చిత్రానికి కొంత అనుకూలత చేకూరినట్టే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More