ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్స్మెంట్ సహా రీసెంట్ లాంచ్ ఈవెంట్ తోనే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఇప్పుడు వినిపిస్తోంది.
దీని ప్రకారం మెగాస్టార్ మళ్లీ చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ లో సర్ప్రైజ్ చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. తన రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజం అయితే మాత్రం ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


