రాజమౌళి ఎన్టీఆర్ కంటే చరణ్ నే ముందు పరిచయం చేస్తాడా…?

Published on Nov 9, 2019 12:28 pm IST

టాలీవుడ్ లో పరాజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలబెట్టినవాడిగా రాజమౌళిని అందరూ కొనియాడుతున్నారు. అలాంటి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై కూడా అదే స్థాయి అంచనాలు నెలకొనివున్నాయి. బాహుబలికి ఏమాత్రం తగ్గని రీతిలో దాదాపు 300కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్స్ చేస్తున్న మల్టిస్టారర్ కావడంతో భారీ హైప్ వచ్చి చేరింది.

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రకటించిన రోజే జులై 30, 2020 విడుదల తేదీగా చెప్పడం జరిగింది. అలాగే ఇద్దరు ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ల చరిత్రకు కాల్పనికత జోడించి తెరకెక్కించడం జరుగుతుంది అని చెప్పారు. కాగా ఈ హీరోలను ఆ ఉద్యమ వీరుల పాత్రలలో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే రాజమౌళి మాత్రం వారి లుక్స్ అసలు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే రోజున వీరి లుక్స్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ కనీసం కొమరం భీం జయంతికి కూడా ఎన్టీఆర్ లుక్ విడుదల చేయలేదు.

ఐతే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది చరణ్ పుట్టిన రోజు కానుకగా అల్లూరి పాత్రను, ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు కొమరం భీం పాత్రను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. చరణ్ పుట్టినరోజు మార్చ్ 27కాగా, ఎన్టీఆర్ ది మే 20, కాబట్టి రాజమౌళి ఎన్టీఆర్ కంటే కూడా చరణ్ లుక్ నే మొదట విడుదల చేస్తారని వినికిడి. ఐతే ఆర్ ఆర్ ఆర్ జులై 30న విడుదలైతేనే వారి లుక్స్ విడుదలవుతాయి. ఒక వేళా ఆర్ ఆర్ ఆర్ విడుదల అనుకున్నట్లుగా కాకుండా వాయిదా పడితే, వీరి పాత్రలను పరిచయం చేయడానికి ఇంకా సమయం పడుతుంది.

సంబంధిత సమాచారం :

X
More