సుకుమార్ బన్నీ, రష్మిక లుక్స్ అలా డిజైన్ చేశాడా…?

Published on Nov 21, 2019 7:08 am IST

క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ బన్నీ ముచ్చటగా మూడో సారి కలిసి సినిమా చేస్తున్నారు. కొద్దిరోజులలో సెట్స్ పక్కెళ్లనున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్తూరు ప్రాంతంలో గల అడవులలో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా ఈ మూవీని సుకుమార్ తెరకెక్కుస్తుండగా, బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన ను తీసుకొన్నారు. కాగా ఆమె పాత్రపై ఆసక్తికర వార్త ప్రచారంలో ఉంది.

రష్మిక మందాన పాత్రను సుకుమార్ విభిన్నంగా రూపొందించారట. ఆమెది ఈ చిత్రంలో డి గ్లామర్ రోల్ అని సమాచారం. ఆమె ఎర్రచందనం స్మగ్లింగ్ కూలీగా కనిపించే అవకాశం కలదు. బన్నీ స్మగ్లర్ గా రా అండ్ రఫ్ లుక్ లో మాస్ అప్పీల్ ఉంటుందట. సుకుమార్ తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం లో చరణ్ మరియు సమంత పాత్రలను డి గ్లామర్ గా ప్రెజెంట్ చేశారు. సమంత ఐతే 80ల కాలం నాటి పల్లెటూరి అమ్మాయి గా కనిపించి అలరించింది. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కూడా కొంచెం రష్మిక పాత్ర రంగస్థలం లో సమంత పాత్రను పోలిఉంటుందని సమాచారం. రష్మిక ఫారెస్ట్ అధికారిగా కూడా కనిపించే అవకాశం కలదని మరో వాదన. ఏదిఏమైనా ఈ విషయాలన్నిటిపై స్పష్టత రావాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More