కలిసొచ్చిన హీరోయిన్ ని జోడిగా తెచ్చుకోనున్నవినాయక్

Published on Nov 24, 2019 1:00 am IST

మాస్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఉన్న వి వి వినాయక్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన సీనయ్య అనే చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వినాయక్ గ్యారేజ్ ఓనర్ లా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వినాయక్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. ఐతే తాజాగా వినాయక్ హీరోయిన్ పై ఆసక్తిర వార్త ఒకటి బయటికొచ్చింది.

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రీయా శరణ్ సీనయ్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. సీనయ్య సినిమాలో పాత్ర రీత్యా మరియు వినాయక్ కి జోడిగా శ్రీయా ఐతే బాగుంటుంది అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. గతంలో వినాయక్ దర్శకుడిగా తెరకెక్కించిన చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్ చిత్రాలతో శ్రీయా హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక నరసింహ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :