మెగా హీరో కోసం ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్!
Published on Jun 14, 2018 9:56 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ముందు సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు అని చెప్పాలి. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కరుణాకరన్ తో ఒక లవ్ స్టోరీని సెట్ చేసుకున్నాడు. తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి వరుసగా సినిమాలను ఒకే చేసుకుంటూ వెళుతున్నాడు. నెక్స్ట్ ఈ మెగా మేనల్లుడు నేను శైలజా దర్శకుడితో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమాకు చిత్ర లహరి అని టైటిల్ సెట్ చేశారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ టైటిల్ కు మరో ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ ను సెట్ చేసినట్లు తెలుస్తుంది.
బార్ అండ్ రెస్టారెంట్ అనే ట్యాగ్ లైన్ ను సినిమా కథకు తగ్గటుగా సెట్ చేశారని సమాచారం. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే డిఫెరెంట్ సినిమా అవుతుందని అని చిత్ర యూనిట్ చెబుతోంది. జులై నుంచి స్టార్ట్ కాబోయే ఆ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook