హరీష్ శంకర్ కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్ !

Published on Jan 27, 2019 9:41 am IST

డీజే తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తండా ను హరీష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రం యొక్క టైటిల్ ను ఈరోజు విడుదలచేశారు. ‘ వాల్మీకి’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్థ పాత్రలో ఎవరని తీసుకుంటారో చూడాలి.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక దబాంగ్ ను తెలుగులో ‘గబ్బర్ సింగ్’ గా రీమేక్ చేసి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న హరీష్ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :