నిఖిల్ కొత్త సినిమాకి డిఫ్రెంట్ టైటిల్ !

Published on Oct 19, 2018 10:12 am IST

యువ హీరో నిఖిల్ కొత్త దర్శకుడు కిషన్ కట్ట తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్వాస’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ దశమి కానుకగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నివేత థామస్ కథానాయికగా నటించనుంది. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై తేజ్ ఉప్పలపాటి , హారిణికేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక నిఖిల్ నటిస్తున్న ‘ముద్ర’ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :