పవన్ సాలిడ్ రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..?

Published on Jul 3, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” అనంతరం లైన్ లో ఉన్న మరో క్రేజీ రీమేక్ చిత్రం మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం”. అక్కడ సాలిడ్ హిట్ అయ్యిన ఈ ఇంటెన్స్ డ్రామాను మన దగ్గర దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ కి అపోజిట్ గా దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దగ్గరగా సగం మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇంకా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఏది అధికారికంగా రాలేదు. దీనితో వాటి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దాని ప్రకారం ఈ చిత్రానికి “పరశురామ కృష్ణమూర్తి” అనే సాలిడ్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక టాక్ లేదు కానీ బహుశా ఇది సూట్ అయ్యేలానే ఉందని చెప్పాలి. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :