నితిన్ సినిమాకు ఆసక్తికర టైటిల్స్.!

Published on Sep 29, 2020 1:00 pm IST

ఈ మధ్యనే మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒకడైన యూత్ స్టార్ నితిన్ ఒకింటివాడు అయ్యాడు. తన పెళ్లివార్త చెవిన వేయడంతోనే మంచి కం బ్యాక్ హిట్ ను అందుకున్న ఈ హీరో అక్కడ నుంచి మరిన్ని ప్రాజెక్టులను తన లైన్ లో పెట్టుకున్నాడు. అలా చేస్తున్న చిత్రాల్లో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటితో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి.

అయితే ఈ చిత్రానికి ఇపుడు మేకర్స్ పలు ఆసక్తికర టైటిల్స్ ను పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తుంది. వాటిలో ఒకటి “చదరంగం” అన్నట్టు వినికిడి. ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి ఒక యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసారా లేక మరేమన్నా మార్చారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన “రంగ్ దే” సంక్రాంతి విడుదలకు రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More