పెద్ద సినిమాల కష్టం వృధానే !

పెద్ద సినిమాల కష్టం వృధానే !

Published on May 3, 2021 2:00 AM IST

కరోనా వల్ల 2020 మొత్తం కరిగిపోయింది. అయితే, ఈ ఏడాదిలో అతి ముఖ్యం అనుకున్న సమ్మర్ సీజన్ కూడా మిస్ అవుతుంది. నిజానికి అన్ని సినిమా ఇండస్ట్రీలు అన్ని 2021 సమ్మర్ కి భారీ సినిమాలను ప్లాన్ చేసుకున్నాయి. అందుకే నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కు రెడీ అవ్వాలనే ఉద్దేశ్యంతో చాల స్పీడ్ గా షూటింగ్ లు జరువుకున్నాయి. హీరోలు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ కోసం తెగ కష్టపడ్డారు. కొరటాల శివ-మెగాస్టార్ ఆచార్య సంగతే తీసుకుందాం. షూట్ కి గ్యాప్ ఇవ్వకుండా మెగాస్టార్ ఈ సినిమా కోసం పని చేశారు.

ఈ సినిమాని సమ్మర్ కి గట్టిగా ప్లాన్ చేశారు. సినిమా కూడా చివరి దశలో ఉంది. కానీ కరోనా సెకెండ్ వేవ్ తో మెగా కష్టం అంతా వృధా అయిపోయింది. అలాగే బోయపాటి-బాలయ్య సినిమాను కూడా భారీ సమ్మర్ సినిమాగా తీసుకోవడానికి బాలయ్య బృందం బాగా ప్లాన్ చేసింది. అదే విధంగా మహేష్ సర్కారువారి పాట కూడా, ఇలాగే ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, కెజిఎఫ్ 2, తలైవి, ఇలా భారీ సినిమాల అన్ని సమ్మర్ రిలీజ్ కోసం తెగ కష్టపడ్డాయి. కానీ మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు