“వీరమల్లు” నుంచి ఇంట్రెస్టింగ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా.?

Published on Aug 6, 2021 7:02 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.. మరి ఇప్పటి వరకు కూడా చాలా మేర షూటింగ్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం మిగతా షూట్ ని త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధం అవుతుంది. అయితే ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ ట్రీట్ ని వదలనున్నట్టుగా బజ్ వినిపిస్తోంది.

మరి దాని ప్రకారం ఈ చిత్రం నుంచి పవన్ బర్త్ డే కానుకగా అదిరే మేకింగ్ వీడియోని రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ టాక్ అయితే మొదలయ్యింది. మరి ఇది ఎంత మేర నిజం అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :