ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ !

ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ !

Published on Oct 3, 2020 11:02 PM IST

bellam

‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఒక ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ‘మనం రేపు చనిపోయాక కూడా జీవిస్తేనే.. మనం శాశ్వతంగా జీవించినట్లు. మహానియుడ్ని జయంతి సందర్భంగా ఆ గొప్ప నాయకుడిని జ్ఞాపకం చేసుకుందాం’ అని పోస్ట్ చేస్తూ.. తానూ చిన్న తనంలో గాంధీజీ గెటప్ వేసిన ఫోటోను నెటిజన్లతో పంచుకున్నాడు.

ఇక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రానున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూట్ లో ప్రస్తుతం బెల్లంకొండ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ‘అల్లుడు అదుర్స్’ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. అలాగే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇక గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట.

తాజా వార్తలు