నాగ్ ‘బంగార్రాజు’ కథ అదే ?

Published on May 10, 2021 8:30 am IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది. జులై నుండి షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే మొదట చైతు – నాగ్ కలయికలో ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చైతు ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడట. అంటే ఈ సినిమా మొత్తం ‘బంగార్రాజు’ అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందట.

అంటే నాగ్ – అఖిల్ కలయికలో తాత మనవళ్లుగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. కానీ జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.

సంబంధిత సమాచారం :