“ఆదిపురుష్” షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jul 10, 2021 10:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస కావ్యం “ఆదిపురుష్” కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా కూడా ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా, చాలా నిష్ఠతో తెరకెక్కుతుంది.

మరి ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇటీవలే దర్శకుడు ముంబైలో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసేసి శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా నడుస్తున్న షూట్ రావణ పాత్రపై జరుగుతుందట.

సైఫ్ పై రావణ లంకగా వేసిన భారీ సెట్టింగ్ లో సన్నివేశాలు ఓంరౌత్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇలా కొన్నాళ్ళు ప్రభాస్ లేని సన్నివేశాలను కంప్లీట్ చేసేసి తర్వాత ప్రభాస్ పై సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దీనితో ఎట్టిపరిస్థితుల్లో కూడా ఈ భారీ 3డి విజువల్ ట్రీట్ ను వచ్చే ఏడాది ఆగష్టు నాటికి రెడీ చేసి రిలీజ్ చేయడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :