సుకుమార్ – బన్నీ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 26, 2020 2:00 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – స్టార్ హీరో అల్లు అర్జున్ కలయికలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ సినిమాలను కూడా సుకుమార్ రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. అలాగే ఈ సినిమాని కూడా అలాంటి జోనర్ లోనే తీస్తున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రివెంజ్ ఫార్ములా కంటే కూడా ఎమోషనల్ గా సాగే యాక్షనే ఎక్కువ ఉంటుందని.. అలాగే బన్నీ పాత్ర కూడా ఫుల్ మాస్ యాంగిల్ లో వైవిధ్యంగా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది.

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ క్యారెక్టర్ లోనే తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ చిత్రంతో కూడా మరో సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More