మోనార్క్‌ గానే రాబోతున్న బాలయ్య ?

Published on Oct 31, 2020 4:56 pm IST

నందమూరి బాలకృష్ణ సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే బాగా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. ఆ మాటకొస్తే బాలయ్యకి యాక్షన్ సెట్ అయినట్లుగా మరే ఎమోషన్ సెట్ అవ్వదు. అందుకే కథల విషయంలో అలాగే డైరెక్టర్ ల విషయంలో కూడా బాలయ్య యాక్షన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది.
అందుకే ‘‘మోనార్క్‌” అనే పవర్ ఫుల్ టైటిల్ ను బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది.

అయితే టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్‌ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘‘మోనార్క్‌” అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అందుకే బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి మరో సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More