యేలేటి హిట్ కొట్టేలానే ఉన్నాడు !

Published on Feb 22, 2021 12:00 pm IST

నితిన్ చేస్తున్న కొత్త చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. జైలులో ఖైదీలా ఇరుక్కున్న హీరో, అతనిపై టెర్రరిస్ట్ అనే ముద్ర, కానీ చంద్రంగం ఆటలో మాత్రం అతనొక జీనియస్. అలాంటి వ్యక్తి తనకు ఎదురైన ఆపద నుండి ఎలా తప్పించుకున్నాడు అనేదే ఈ సినిమా అట. అయితే ఈ సినిమా గురించి చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘చెక్ సినిమాకు సంబంధించిన ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఓ పది పదిహేను ఏళ్లుగా నాలో ఉంది. అది రకరకాలుగా మారి ‘చెక్’లా తయారైంది. అంటే… ఐడియా లెవలో ఉన్నది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఉండదు. కాబ‌ట్టి కథపై చాలా రీసెర్చ్ చేసి త‌యారు చేశాను’ అని చెప్పుకొచ్చారు.

కాగా చంద్రశేఖర్ యేలేటి అంటేనే క్రియేటివిటీ. అలాంటి డైరెక్టర్ సంవత్సరాలు తరబడి ఒక ఐడియా మీద వర్క్ చేసాడంటే.. మరి ఈ సినిమాలో మ్యాటర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి యేలేటి హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇక ఈ కథలో చెస్ గేమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అట. ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ చూస్తే సినిమా కూడ చదరంగం ఆటలానే థ్రిల్లింగానే ఉంటుందని అనిపిస్తోంది. ట్రైలర్ అయితే సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసిందనే అనాలి. భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More