ప్రభాస్ సలార్ లో హైలైట్ సీక్వెన్స్ అదే !

ప్రభాస్ సలార్ లో హైలైట్ సీక్వెన్స్ అదే !

Published on Jan 17, 2022 10:00 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. పైగా పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం ఇది. అందుకే, ‘సలార్’ సినిమా పై నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సలార్ పై బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. అందుకే అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. .ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించబోతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు