“సలార్” వల్ల ప్రభాస్ సినిమాల ప్లానింగ్ మారనుంది !

“సలార్” వల్ల ప్రభాస్ సినిమాల ప్లానింగ్ మారనుంది !

Published on Dec 13, 2020 3:00 AM IST

Salaar

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో సినిమా దెబ్బకు.. ప్రభాస్ మిగతా సినిమాల రిలీజ్ ప్లానింగ్ మొత్తం మారిపోయేలా ఉంది. పైగా “సలార్” సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయబోతున్నాడు. ప్రశాంత్ కూడా ఎక్కువ కాలం సినిమా చేస్తాడు కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ కేటాయించాలి. అలా కేటాయిస్తే.. ఆల్ రెడీ ఒప్పుకున్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ అవుతాయి. అయితే జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అని అంటున్నారు.

దీనికి తోడు ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” సినిమా ఉంది. “ఆదిపురుష్” జనవరి 2021లో ప్రారంభం అవుతుందని ఎనౌన్స్ చేసారు. మరి ఇప్పుడు జనవరిలో ఏ సినిమాని మొదలు పెడతాడో చూడాలి. నిజానికి ఈ రెండు సినిమాల కన్నా ముందు “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్క్షన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాదే ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. నాగ్ అశ్విన్ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వకతప్పదు. అలాగే సలార్ వల్ల మిగిలిన సినిమాలు ప్లాన్ మార్చుకోవాల్సి వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు