“పవన్ రానా” చిత్రపు ఆడియో రైట్స్ వారి చెంతకు.?

Published on Aug 6, 2021 6:23 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల కాంబోలో ఓ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి మాస్ లో భారీ హైప్ తో ఉన్న ఈ చిత్రం నుంచి జస్ట్ గత కొన్ని రోజుల్లోనే సాలిడ్ అప్డేట్స్ మేకర్స్ ఇచ్చారు.

అంతే కాకుండా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా తొందరలోనే వదులుతున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. అయితే మరి ఈ చిత్రం ఆడియో హక్కులు ఎవరు కొనుగోలు చేశారు ఏ ఆడియో సంస్థ నుంచి భీమ్లా నాయక్ పాటలు మనం వినబోతున్నాం అన్న దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

మరి ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ ఆడియో లేబుల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు ఈ చిత్రం ఆడియో హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :