రామ్ – బోయపాటి సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

రామ్ – బోయపాటి సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 27, 2022 9:03 PM IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – హీరో రామ్ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడట. అంటే.. అటు హీరోగా ఇటు విలన్ గా రామ్ నే నటించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ ది డ్యుయెల్ రోల్. ఓ పవర్ ఫుల్ రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇది అన్నదమ్ముల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అట.

ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడట. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో లేటెస్ట్ గా అదిరిపోయే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు