“RRR” షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“RRR” షూట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Sep 4, 2021 8:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. మరి ఇటీవల సినిమా షూట్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు మరిన్ని ఇతర పనుల్లో బిజీగా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది.

నిజానికి మేజర్ సీక్వెన్స్ లు పై ఇద్దరు హీరోలపై అన్ని కంప్లీట్ అయ్యిపోయినా ఇంకా చిన్న రీషూట్స్ మాత్రం ఉన్నాయట. వాతైనే ఇప్పుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అయితే ఈ సీన్స్ అన్నీ మరింత పర్ఫెక్షన్ కోసం తెరకెక్కిస్తున్నారట. మరి దీనికోసం ఇంకో వాసరం రోజులు అలా టైం పట్టనున్నట్టు టాక్. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు