సాహో విలన్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

Published on Aug 7, 2019 9:50 am IST

“సాహో” విడుదలకు కేవలం ఇంకా రోజుల వ్యవధే మిగిలివుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ “సాహో” మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూపోతున్నారు.రెండు రోజుల క్రితం ప్రధాన విలన్ పాత్ర చేస్తున్న నీల్ నితిన్ ముఖేష్ లుక్ ని రివీల్ చేసిన చిత్ర బృందం నిన్న మరొక విలన్ అరుణ్ విజయ్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇద్దరూ “సాహో” చిత్రానికి తగ్గట్టుగా సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. కాస్ట్యూమ్స్ నుండి అప్పీరెన్స్ వరకు వారిద్దరి లుక్స్ చూస్తుంటే “సాహో” మూవీలో ప్రభాస్ ఈ రేంజ్ విలన్స్ తో తలపడనున్నాడని అనే ఆసక్తి రేగుతుంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రతి విలన్ ని పరిచయం చేస్తున్న పోస్టర్ లో డీప్ మీనింగ్ తో ఓ కొటేషన్ పెడుతున్నారు. నీల్ నితిన్ పోస్టర్ లో “అంతం అన్నిటికీ సమాధానం కాదు” (ది ఎండ్ డస్ నాట్ ఆన్సర్ ఎవ్రీథింగ్)అనే సీరియస్ లైన్ ఉండగా, నిన్న విడుదల చేసిన అరుణ్ విజయ్ పోస్టర్ లో యుద్దానికి ఆహ్వానం అవసరం లేదు (బ్లడ్ డస్ నాట్ నీడ్ బ్లడీ ఇన్విటేషన్)అనే డేంజరస్ కోట్ ఉండటం గమనార్హం. వీరి ఇంట్రడక్షన్ పోస్టర్స్ లో ఉన్న లైన్స్ చూస్తుంటేనే వీరు ఎంత డేంజరస్ విలన్లో అర్థం అవుతుంది. వీరు క్లాసిక్ లుక్ లో కనిపించే డేంజరస్ విలన్స్ లా కనిపిస్తున్నారు. సాధారంగా హాలీవుడ్ సినిమాలలో మైండ్ గేమ్ తో హీరోలను తికమకపెట్టే ఇంటెలిజెంట్ విలన్స్ ల కనిపిస్తారని సమాచారం.

సంబంధిత సమాచారం :