సందీప్ కిషన్ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ !
Published on Oct 25, 2017 11:17 am IST

తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ రెండు పరిశ్రమలకు దగ్గరవుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘నరగసూరన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇది వరకే మొదలై ఊటీలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. ఈ నెల 27 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ కూడా ఊటీలోనే జరగనుంది.

ఇప్పటి వరకు సందీప్ కిషన్, ఆత్మికల మీదే జరిగిన ఈ షూటింగ్ లో ఇకపై అరవింద స్వామి, శ్రియ శరన్ లు కూడా పాల్గొననున్నారు. ఈ చిత్రాన్ని ‘దురువంగల్ పతిన్నారు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తుండటం విశేషం. కెరీర్లో సరైన హిట్ కోసమా ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు.

 
Like us on Facebook