వెబ్ తోనైనా హాట్ బ్యూటీకి మళ్ళీ క్రేజ్ వస్తోందా ?

Published on Apr 8, 2020 1:00 am IST

సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా పాపులర్ అయిన హెబ్బా పటేల్‌.కి ఆ సినిమా హిట్ కారణంగా మొదట్లో బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ లతో అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు లేక గెస్ట్ రోల్స్ కు అండ్ ఐటమ్ సాంగ్స్ కు పరిమితమైంది. అయితే వీటితో పాటే ఇంకో అడుగు ముందుకేసి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తరహాలోనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది,

ఇప్పటికే మస్తిస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది హెబ్బా. ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లు చేయడానికి సన్నద్దమవుంతుందట. ఆహాలో ప్రసారమయ్యే రెండు వెబ్ సిరీస్ ల్లో హెబ్బా నటించబోతుంది. మరి ఈ వెబ్ ప్రయత్నంతోనైనా హెబ్బా పటేల్ మళ్ళీ క్రేజ్ ను అందుకుంటుందేమో చూడాలి.

ఇక ‘రెడ్’ సినిమాలో కూడా ఈ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హెబ్బా కనిపించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం కనిపించబోతుందట. అలాగే ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా రెడ్ సినిమాలో నటిస్తోందట.

సంబంధిత సమాచారం :

X
More