‘మహర్షి’లో మహేష్ పాత్ర గురించి లేటెస్ట్ అప్ డేట్ ?

Published on Oct 22, 2018 5:26 pm IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రం ప్రస్తుతం యూఎస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోయే పాత్ర గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ తెగ హాల్ చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సినిమాలో మహేష్ యూఎస్ లోని ఒక ప్రముఖ హోటల్ కు మేనేజర్ గా కనిపించనున్నాడని.. అలాగే కథ ఇండియాకి షిఫ్ట్ అయినప్పుడు.. మహేష్ ఒక కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఇటివలే ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :