హీరోయిన్ దెబ్బకి సినిమా నుండే తప్పుకున్న నిర్మాత ?
Published on Sep 11, 2018 12:19 pm IST

పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా మొదలైయింది ఈ చిత్రం. అయితే రోజు రోజుకు ఈ చిత్రం వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో క్రిష్ కి కంగనాకి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని.. ఆ కారణంగానే క్రిష్ సినిమా నుండి తప్పుకున్నారని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే సోనూ సూద్‌ మల్లయుద్ధంకి సంబంధించిన సీన్స్ ను కూడా కంగనా తొలిగించిదని… వాటిని అనవసరంగా తొలిగించారనే ఉద్దేశ్యంతోనే సోనూ సూద్‌ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని బాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పుడు తాజాగా మణికర్ణికకు మరో షాక్ తగిలింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజయ్‌ కుట్టి కూడా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం బడ్జెట్‌ మొదట అనుకున్న దానికంటే, భారీగా పెరిగిపోవటంతో సంజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో కొన్నాళ్ళు ఆగితే గాని తెలియదు. కాగా సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .

  • 11
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook