ఎన్టీఆర్ తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి, సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి సీన్స్ కూడా ఉన్నాయట. కాగా ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కనిపించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా అలరిస్తోంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇటు తండ్రిపాత్రలోనూ.. అటు కొడుకు పాత్రలోనూ నటిస్తున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


