ఇంటర్వ్యూ : కాజల్ అగర్వాల్ – ‘ఎం.ఎల్.ఏ’ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ !

ఇంటర్వ్యూ : కాజల్ అగర్వాల్ – ‘ఎం.ఎల్.ఏ’ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ !

Published on Mar 22, 2018 3:34 PM IST

కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) కళ్యాణ్ రామ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) దాదాపు దశాబ్దం తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చేశాం. నటుడిగా కళ్యాణ్ రామ్ చాలా ఎదిగారు. నేను కూడ చాలా సినిమాలు చేశాను. ఒకరకంగా పాత స్నేహితులం కలుసుకున్నట్లుంది.

ప్ర) మొదటి సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ చేసేప్పుడు ఇంత ఎత్తుకి ఎదుగుతానని అనుకున్నారా ?
జ) అస్సలు అనుకోలేదు. ఒక్క సినిమా చేసి తిరిగి ఎం.బి.ఏ చేయాలని అనుకున్నాను. కానీ లైఫ్ వేరేలా ప్లాన్ చేయబడింది. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.

ప్ర) ‘ఎం.ఎల్.ఏ’ సినిమాలో మీ రోల్ ఏమిటి ?
జ) ఇందులో నేను ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తాను. చాలా ఇంటిలిజెంట్ గా, ధృడమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాను.

ప్ర) అసలు ఈ సినిమా దేని గురించి ?
జ) ఇది సోషల్ మెసేజ్ కలిగిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ప్ర) ‘అ !’ సినిమా ఇచ్చిన ఫలితంతో మీరు సంతృప్తి చెందారా ?
జ) ప్రేక్షకులు ‘అ !’ సినిమాను అంగీకరించారు. ఒక భిన్నమైన సినిమాను అందరూ మెచ్చుకోవడమే ఒక గొప్ప సంతృప్తి.

ప్ర) రవితేజ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణాలేవైనా ఉన్నాయా ?
జ) అంటే ఇతర కమిట్మెంట్స్ ఉండటం వలన ఆ సినిమాకి సైన్ చేయలేదు. అంతేకానీ అందులో ప్రత్యేకమైన కారణాలేవీ లేవు.

ప్ర) మీ తర్వాతి సినిమాలు ?
జ) ప్రసుతం ‘క్వీన్’ తమిళ రీమేక్లో నటిస్తున్నాను. అది కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి సైన్ చేశాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు