ఇంటర్వ్యూ : కార్తీ – చినబాబు ఒక వేడుక లాంటి చిత్రం !

ఇంటర్వ్యూ : కార్తీ – చినబాబు ఒక వేడుక లాంటి చిత్రం !

Published on Jul 10, 2018 6:39 PM IST

 

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన నూతన చిత్రం చినబాబు . ఈ చిత్రం ఈ నెల 13 ప్రేక్షకులముందుకు రానున్న సంధర్బంగా చిత్ర హీరో కార్తీ మీడియాతో మాట్లాడారు . ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం …

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ చిత్రంలో రైతు పాత్రలో నటించాను. దాని కోసం కొంచం పరిశోధన కూడా చేశాను మేము వ్యవసాయ సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని ఒక వేడుక లా చూపెట్టడం జరిగింది అది చాలా కష్టమైన పని. అలాగే ఈ చిత్రంలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం గురించి కూడా చూపెట్టాం .

మీ డైరెక్టర్ పాండి రాజ్ గురించి చెప్పండి ?
పాండి రాజ్ ఇంతకుముందు ‘పసంగా’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న పిల్లల నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రమంటే నాకు చాలా ఇష్టం. తరువాత ఒక రోజు ఈ స్క్రిప్ట్ తో నా దగ్గరికి వచ్చారు . కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను.

ఈ చిత్రాన్ని మీ అన్నయ్య సూర్య గారే నిర్మించారు ఆయన గురించి ?
ఆయన ఒక మంచి నిర్మాత పారితోషికం కరెక్ట్ గా ఇచ్చారు(నవ్వుతూ ) అలాగే ఈ చిత్ర షూటింగ్ టైం లో మరియు డబ్బింగ్ సమయంలో ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. అవి ఈ చిత్రానికి చాలా ఉపయోగపడ్డాయి.

మీ హీరోయిన్ సాయేషా సైగల్ గురించి ?
పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె గుర్తిండిపోయే పాత్రలో నటించింది ఈ పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది.

రంగస్థలం శత్రు ని ఈ చిత్రంలో గంబీరమైన పాత్రలో చూపెట్టారని ట్రై లర్ లో తెలుస్తుంది . ఆయన ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించారా ?

అలాని కాదు . మేమిద్దరం ఈ చిత్రంలో స్కూల్ మేట్స్ చిన్న గొడవ వల్ల విడిపోతాము. అదేంటనేది ఆసక్తికరంగా రివీల్ చేయబడుతుంది.

ఇంకా ఈ చిత్రంలో ఎవరెవరు ప్రధాన పాత్రల్లో నటించారు ?
సత్యరాజ్ గారు ఈ చిత్రంలో నాకు తండ్రి గా నటించారు. అలాగే ఇంకా చాలా మంది సీనియర్ నటి నటులు మంచి పాత్రలో నటించారు. సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన కూడా వాళ్ల పాత్రలు గుర్తిండిపోతాయి.

మీరు ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు ?
ఇప్పుడు ఒక ప్రేమ కథ చిత్రంలో నటిస్తున్నాను దాంట్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు