ఇంటర్వ్యూ : మహేష్ బాబు – బొమ్మ దద్ధరిల్లిపోయిద్ది !

ఇంటర్వ్యూ : మహేష్ బాబు – బొమ్మ దద్ధరిల్లిపోయిద్ది !

Published on Jan 9, 2020 4:45 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ చేస్తున్నారు. కాగా ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

‘మహర్షి’ తరువాత ఈ సినిమా చేయాలనుకోలేదు. కానీ ఈ సినిమాని ముందుగానే చేయడానికి ముఖ్య కారణం ?

అనిల్ రావిపూడి ఈ సినిమా కథ చెప్పినప్పుడే నాకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇద్దరం తరువాత చేద్దాం అనుకున్నాము. కానీ ఆయన డైరెక్షన్ చేసిన ‘ఎఫ్ 2’ చూసిన తరువాత.. ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ ని నేను ఈ టైంలో చేస్తే బాగుంటుందని నేనే అనిల్ ని అడిగాను. ముందే సినిమా చేద్దామా అంటే అతను కూడా బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఐదు నెలలో సినిమా పూర్తి చేశాం. నా కెరీర్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఈ సినిమా అని అనుకుంటున్నాను.

 

సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?

బొమ్మ దద్దరిల్లిపోయింది అండి. సరదాగా అంటున్న మాట కాదు ఇది. సినిమాని ఇప్పటికే మా టీంతో పాటు కొంతమంది చూశారు. అందరూ మేము ఏది అయితే ఫీల్ అయ్యామో దాన్నే సినిమా చూసిన వాళ్ళు అందరూ ఫీల్ అయ్యారు. ఈ సినిమా బాగా కొట్టబోతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము.

 

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మరోలా ఉంటుంది. ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూస్తారు. ముఖ్యంగా నా ఫ్యాన్స్ కు అయితే నా క్యారెక్టర్ చాల బాగా నచ్చుతుంది. చాల కొత్తగా ఉంటుంది. అలాగే కొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

 

దర్శకుడిగా అనిల్‌ రావిపూడి గురించి ?

ఇప్పటివరకూ అనిల్‌ రావిపూడి తీసిన సినిమాలు ఒకటి.. కానీ ఈ సినిమా వేరే ఒకటి. అతని ఈ సినిమాతో దర్శకుడిగా పది రేట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని. అనిల్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం, ఆయన రాసిన ఎంటర్ టైన్మెంట్ చాల బాగా వచ్చాయి.

 

రష్మిక రోల్ గత చిత్రాలకు చాల భిన్నంగా డిజైన్ చేసినట్లున్నారు?

ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కి ఒక రెగ్యులర్ హీరోయిన్ సెట్ కాదు. ఒక ఫ్రెష్ పేస్ కావాలి, అందుకే రష్మిక ను తీసుకున్నాం. రష్మిక చాలా బ్రిలియంట్ , అనిల్ డిజైన్ చేసిన ఓ భిన్నమైన రోల్ చాలా చక్కగా చేసింది. ఆమె పాత్ర కూడా ఈ చిత్రంలో ఓ కీ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది.

 

కేజిఎఫ్ డైరెక్టర్ ని కలిసారుట కదా?

అవును కలిశాను.. కలవడం వలన ఏమి జరిగిపోదు కదా. కొన్ని స్టోరీ లైన్స్ వినడం కూడా జరిగింది. అది జరిగినప్పుడు జరుగుతుంది.

 

మల్టీ స్టారర్ చేసే ఆలోచన ఉందా?

అలాంటి కథ వస్తే.. తప్పకుండా చేస్తాను. ఓ మంచి కథతో దర్శకులు ఎవరొచ్చినా మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధం.

 

విజయశాంతిగారితో మళ్లీ నటించటం ఎలా అనిపించింది ?

ఫస్ట్ ఆవిడ మా సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక ఆమెతో మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత నటించడం చాల హ్యాపీగా అనిపించింది.

 

కృష్ణగారు కూడా ఈ సినిమాలో నటించారు ?ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ?

సినిమాలో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. మేము కూడా ఆ ఎపిసోడ్ కి వచ్చే స్పందన కోసం చాల ఎగ్జైట్ గా ఉన్నాం.

 

మీ తదుపరి సినిమా గురించి ?

ఈ సినిమా రిలీజ్ తరువాత మూడు నెలలు గ్యాప్ తీసుకుంటాను. ఆ తరువాత వంశీ పైడిపల్లితో సినిమా స్టార్ట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు