ఇంటర్వ్యూ : హరి ప్రసాద్ జక్కా – “ప్లే బ్యాక్” కథ విన్నపుడు సుకుమార్ చాలా ఎగ్జైట్ అయ్యాడు..

Published on Mar 4, 2021 6:41 pm IST

టైం ట్రావెల్ లేదా కాలాన్నే ప్రధాన అంశంగా తెరకెక్కించిన సినిమాలు మన ఇండియా లోనే కాస్త తక్కువ ఉన్నాయి. మరి రేర్ జానర్ నుంచి సరికొత్త ప్రయత్నంగా వస్తున్న లేటెస్ట్ చిత్రం “ప్లే బ్యాక్”. రెండు డిఫరెంట్ కాలాలకు చెందిన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కాస్త ఆసక్తి నెలకొల్పుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు హరి ప్రసాద్ జక్కా నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి తాను ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారో చూద్దాం.

ఈ ప్లే బ్యాక్ ఎలా స్టార్ట్ అయ్యింది.?

నేను ముందు దీనికి ప్లే యువర్ లైఫ్ బ్యాక్ అని పెడదాం అనుకున్నా కానీ మరీ లాంగ్ అవుతుందని షార్ట్ చేశా. దీని కన్నా ముందు నేను ఫిజిక్స్ లెక్చరర్ గా చేశాను సో అలా నాకు కాస్తే ఎప్పుడూ ఇంట్రస్ట్ ఉండేది. పైగా మన తెలుగు నుంచి ఒకే ఒక్క టైం ట్రావెల్ సినిమా “ఆదిత్య 369″వచ్చింది. కానీ ఇది అలా ఉండదు టైం ట్రావెల్ సినిమాలో ఫిజికల్ గా ఒక టైం నుంచి మరో టైం కి ట్రావెల్ అవుతాం కానీ ఇది క్రాస్ ఓవర్ ఒక టైం కు ట్రావెల్ అవ్వకుండా ఒక్కో టైం లో మనుషులు జస్ట్ కమ్యూనికేట్ అవుతారు అందుకే ఇండియాలోనే ఇలాంటి సినిమా మొదటిది అని చెప్తున్నా.

ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా?

దీనిపై అంటే ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ మీద వందల సినిమాలు చూసాను నేను కానీ మనదగ్గర ఇప్పటి వరకు రానిది కాబట్టి కొత్తగా ఉంటుంది చేద్దాం అనుకున్నాను. కానీ ఈ కాన్సెప్ట్ కోసం అనుకోవడం తర్వాతనే అవన్నీ చూసా కానీ ఇన్స్పిరేషన్ ఏమి లేదు.

స్క్రీన్ ప్లే బాగా క్లిక్ అయ్యిందా?

మొదట నేను అనుకున్నదే మంచి ఎమోషన్ థీమ్ అనుకున్నా కథ చాలా త్వరగా క్లిక్ అయ్యిపోయింది కానీ స్క్రీన్ ఒక్కదానికే మాత్రం ఆల్ మోస్ట్ సంవత్సరం పట్టేసింది. ఎందుకు ఇంత టైం పట్టింది అంటే రెండు టైమ్స్ ని చూపించాలి పైగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూపించాలి అందుకే ఇంత టైం పట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఏమీ చదువుకోని వ్యక్తి చూసినా సరే క్లియర్ గా అర్ధం అవుతుంది ఈ సినిమా.

హీరో హీరోయిన్స్ ను ఎలా ఎంచుకున్నారు?

నేను ముందే అనుకున్నాను ఈ కాన్సెప్ట్ కు ఎక్కువగా ఫేమ్ లేకుండా నటులను తీసుకోవాలని ఎందుకంటే ఆ పాత్రలకు చాలా సింపుల్ గా ఉండాలి అప్పుడు “హుషారు”లో నాకు దినేష్ అయితే కరెక్ట్ అనిపించింది. ఇక హీరోయిన్ కోసం చూసినప్పుడు అనుకోకుండా మల్లేశం సినిమా చూసాను అప్పటికే ఓ తెలుగు అమ్మాయితోనే చేద్దాం అనుకున్న టైం లో ఈమె కనిపించింది సో తనని సెలక్ట్ చేశాం.

ఇలాంటి కథలు స్టార్స్ తో చేస్తే ఇంకా రీచ్ అవుతుంది కదా?

అసలుకి నేనేం అనుకున్నా అంటే ముందు ఇలాంటి సినిమాలను ముందు జనానికి అలవాటు చెయ్యాలి. అలాగే ఎలాంటి రిస్క్ కానీ ఇమేజి డామేజ్ చెయ్యకూడదు. ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా ఉండదు కానీ 2 గంటలకు పైగా ఉన్నా సీట్ నుంచి ఎవరూ కదలరు. కానీ స్టార్స్ తో చేస్తే ఇమేజ్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏదోకటి పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు అది చేతకాదు అందుకే అప్పుడే వద్దు అనుకున్నా.

1993 నుంచి 2019 వరకు ఈ ఫిగర్ తీసుకోడానికి కారణం?

దీనికి కారణం ఏంటంటే హీరో తాను 2019లో ఉన్నపుడు హీరోయిన్ 1993లో ఉందని ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ 1993లో ఉన్న హీరోయిన్ కి హీరో 2019లో ఉన్నాడని కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకాలి అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నది స్క్రీన్ పైనే చూడాలి. మరి ఈ డిఫరెన్స్ ను కొంచెం మారుద్దాం అనుకున్నా సెట్టవ్వలేదు సో ఈ గ్యాప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని 1993 నుంచి 2019కి గ్యాప్ తీసుకున్నా.

రెండో సినిమాకే ప్రయోగం చేశారు కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?

నేను ఇది అసలు ప్రయోగం అనుకోట్లేదు నా నుంచి జస్ట్ ఒక కొత్త కథే అనే చెప్తా. ప్రయోగం అంటే మరీ ఎక్కడా లేని కథను తీసుకొచ్చి చేస్తే దానిని అనుకుంటా కానీ ఇది అలా కాదు కథ పరంగా ప్రయోగం కాదు కానీ కాన్సెప్ట్ పరంగా ప్రయోగం అని చెప్తా..

సుకుమార్ మిమ్మల్ని గూగుల్ అంటారట, ఈ సినిమా ఆయన చూసారా?

సుకుమార్ కి ఏదన్నా చిన్న డౌట్ ఉండి నాకు కాల్ చేస్తాడు లక్కీగా ఏంటంటే నాకు దాదాపు తెలిసినవే అడుగుతాడు సో నేను చెప్పేస్తా ఇంకోటి ఏంటంటే నన్ను పది ప్రశ్నలు అడిగితే నేను ఇదే చెప్పినా మిగతా ఐదు మర్చిపోతాడు అందుకు నన్ను గూగుల్ అంటాడు. ఇంకా ఈ సినిమా కథ చెప్పినప్పుడే సుకుమార్ చాలా థ్రిల్ అయ్యాడు. రెండు సార్లు ఈ సినిమాను చూసాడు. ఈ కథను విన్నపుడు అయితే నేనే ఈ సినిమా చేసేస్తా అన్నంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు.

“ప్లే బ్యాక్” సినిమాకి వచ్చే ఆడియెన్స్ కోసం ఏం చెప్తారు?

నేను క్రాస్ టైం కనెక్షన్ అని కొత్త పదం చెప్తున్నాను కానీ ఇది మన అందరి ఎమోషన్ ఈ కథ. ఇండియాలో ఇలాంటి కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. అందమైన ఎమోషన్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. థియేటర్ కి వచ్చి చూస్తే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రమే కాకుండా మీ పక్క వాళ్ళని కూడా తీసుకెళ్లారు.

మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఈ ప్లే బ్యాక్ కాన్సెప్ట్ మీదే మూడు కథలు ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి ఒకటి ఈ సినిమా టాక్ ని బట్టి ఉంటుంది. అయితే ఎలాంటి సీక్వెల్ కాదు పూర్తిగా కొత్తవి అవి క్యాస్టింగ్ కూడా సేమ్ ఉండదు అంతా డిఫరెంట్ అవి.

సంబంధిత సమాచారం :