ఇంటర్వ్యూ : దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు – “రికార్డ్ బ్రేక్” పై అందుకే ఎక్కువ బడ్జెట్ పెట్టాను

ఇంటర్వ్యూ : దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు – “రికార్డ్ బ్రేక్” పై అందుకే ఎక్కువ బడ్జెట్ పెట్టాను

Published on Mar 5, 2024 9:05 AM IST

ఈ మార్చ్ 8న టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో పాన్ ఇండియా మూవీ “రికార్డ్ బ్రేక్” కూడా ఒకటి. మరి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మరి అవేంటో చూద్దాం.

ఈ సినిమాకి రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి?

గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించాం.

అసలు ఈ రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఎలా అనుకున్నారు?

ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అలాగే శనివారం మీడియా కు వేసిన షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.

ఈ సినిమాలో క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందే అనుకున్నారా?

సినిమాకి అది అవసరం ముందే అనుకునే అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్ ని చేయించాం.

ఈ సినిమాకి హీరోలు వీళ్లే అని ముందే అనుకున్నారా?

ప్రజెంట్ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్ పుటప్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు గారు కృష్ణంరాజు గారు ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు.

ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మీ పాషన్ ఏంటి?

ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం.

సినిమా థియేటర్లు ఎక్కువ దొరికాయా?

థియేటర్లో ఎక్కువ దొరికినా కూడా నేనే బిచ్చగాడు లాగా కొన్ని థియేటర్లు రిలీజ్ చేసి సినిమా సక్సెస్ తర్వాత పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం.

ఈ సినిమాలో మీకు టచ్ అయ్యిన సీన్ ఏదన్నా ఉందా?

బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది.

మీ సంస్థ నుంచి మీ నుంచి పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలు ఆశించవచ్చా?

నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.

ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?

ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్నా. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు