ఇంటర్వ్యూ : రఘు దీక్షిత్ – నిజంగా అలా పని చెయ్యడం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి పెద్ద ఛాలెంజ్ !

Published on Jul 10, 2018 1:02 pm IST

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో విజయ్ యలకంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లతో ‘వైఫ్ ఆఫ్ రామ్’ బాగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా మీరు చెయ్యడానికి రీజన్ ఏమిటి ?
ఈ సినిమా నేను చెయ్యడానికి రీజన్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తరుణ్ ఈ చిత్ర దర్శకుడు విజయ్ ఫ్రెండ్స్. విజయ్ ని నాకు తరుణే పరిచయం చేశారు. కానీ లాస్ట్ ఇయర్ విజయ్ నాకు ఫోన్ చేసి ఒక సినిమా చేస్తున్నాను సాంగ్స్ ఉండవ్ ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే ఉంటుందని చెప్పారు. కథ విన్నాను. చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాకి ఎంతో ఆసక్తితో పని చేశాను.

మీకు తెలుగులో ‘వైఫ్ ఆఫ్ రామ్’ మొదటి సినిమా కదా ?
అవును. నేను బాలీవుడ్, కన్నడ ఫిల్మ్స్ చేశాను గానీ, తెలుగులో మాత్రం ఇదే నా మొదటి సినిమా. ఈ సినిమాకి పని చేసే ముందు తెలుగు సినిమాల మ్యూజిక్ కి సంబంధించి చాలా స్టడీ చేసి మరి ఈ సినిమా చేశాను.

ఈ సినిమాలో మ్యూజిక్ గురించి చెప్పండి ?
రెగ్యూలర్ తెలుగు ఫిల్మ్ మ్యూజిక్ లా అయితే ఉండదు. ఒక సస్పెన్స్ తో నడిచే ఓ కిల్లర్ కథ ఇది. సో కథకి తగ్గట్టే మ్యూజిక్ అందించాను. ఇప్పటికే ట్రైలర్లో వచ్చిన చిన్న బిట్ కే చాలామంది బాగా చేశారని కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఒక్క సాంగ్ కూడా లేని ఈ సినిమాలో పని చేసినందుకు ఎలా ఫీల్ అయ్యారు ?
నిజంగా అలా పని చెయ్యడం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి పెద్ద ఛాలెంజ్. పైగా నాకు మొదటి తెలుగు సినిమా, బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. వీటిన్నటి మధ్య పని చేయడం నిజంగా ఛాలెంజే, నేను కూడా అలాగే ఫీల్ అయి పని చేశాను.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీకు ఎలా పరిచయం, మీరు ఎప్పటినుంచి ఫ్రెండ్స్ ?
తరుణ్ భాస్కర్ నాకు పెళ్లిచూపులు తర్వాతే పరిచయం అయ్యారు. కానీ మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం.

బాలీవుడ్ లో ఎన్ని సినిమాలకి పని చేశారు ?
బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా నాలుగు సినిమాలకి పని చేశాను. అలాగే కన్నడంలో కూడా కొన్ని సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాను. (నవ్వుతూ) ఇప్పుడు తెలుగులో కూడా చేయబోతున్నాను.

‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా మీరు ఆల్ రెడీ చూసి ఉంటారుగా ఎలా అనిపించింది ?
చాలా ఇంట్రస్టింగ్ గా సప్సెన్స్ తో సాగుతుంది కాబట్టి ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డిఫరెంట్ జోనర్ ఫిల్మ్, తెలుగు ప్రేక్షకులకు ఫ్రెష్ గా అనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్ గా ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు.

సంబంధిత సమాచారం :