ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఈ సీక్వెల్ ప్రేక్షకులకు బెస్ట్ గిఫ్ట్.. నవ్వుతూనే వుంటారు !

Published on May 26, 2022 6:56 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం.

గని సినిమా వైఫల్యం గురించి ?

నేను గని సినిమాతో మూడు సంవత్సరాలు ప్రయాణించాను. కోవిడ్ కారణంగా, మేము ఆ సినిమా విషయంలో రిజల్ట్ ను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాము. సినిమా పెద్ద హిట్ అవుతుందని భావించాను, కానీ అలా జరగలేదు.

ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఎఫ్ 3 అంటే ఖచ్చితంగా భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది ?

ఖచ్చితంగా బాధ్యత వుంటుంది. ఐతే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడిగారు తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్ గా అనిపించాయి. వెంకటేష్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్ లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా వుంటుంది.

ఎఫ్ 3 లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ?

ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు… వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది.

నత్తి కోసం స్పెషల్ గా హోం వర్క్ చేశారా ?

అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. ఐతే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఎఫ్ 3 లో ఫన్ ఎవరికి ఫస్ట్రేషన్ ఎవరికి ?

డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపిస్తారు.

వెంకటేష్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు ?

వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలౌతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా వుంటారు. చిరంజీవి గారితో ఆయనకి వుండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్ గా వుంటారు. చాలా క్రమశిక్షణగా వుంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. పాజిటివ్ గా వుంటారు.

ఎఫ్ 3 లో కామెడీ కాకుండా మీకు మెహరీన్ కు రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా ఉందా ? సాంగ్స్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు ?

మీరు పాట ని సరిగ్గా గమనిస్తే మెహరీన్ కు కొంచెం దూరంలోనే వుంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. ఐతే అమ్మాయి- అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్నీ పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి. ఎఫ్ 2 నేను వెంకటేష్ గారు కోబ్రా గా కనిపించాం. ఇందులో జస్ట్ .. బ్రోస్ గా కనిపిస్తాం.

ఎఫ్ 3 షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

ఎఫ్ 2షూటింగ్ లో కొంతమంది కొత్త. కానీ ఎఫ్ 3కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీగా వుండేది. అన్నపూర్ణమ్మగారు, వై విజయ గారు మా కోసం అప్పుడప్పుడు భోజనం తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా వుండేది.

ఎఫ్ 3 బడ్జెట్ పెరిగింది. రెమ్యునిరేషన్ కూడా పెరిగింది. మీ వాటా ఎంత పెరిగింది ?

సినిమా హిట్ కొడితే సాధారణం గానే రేమ్యునిరేషన్ పెరుగుతుంది కదా. ఇందులో చెప్పడానికి ఏముంది(నవ్వుతూ)

ఎఫ్ 3లో మీరు చాలా కొత్తగా ఉంటారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తున్నారు ? ఏమిటా కొత్తదనం ?

ఎఫ్ 3నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఎఫ్ 2లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ఎఫ్ 3కి వచ్చేసరికి స్పెషల్ గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండేపాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా వుంటుంది.

ఎఫ్2 కథ కి కొనసాగింపుగా ఎఫ్ 3 వుంటుందా ?

లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం.

ఎఫ్ 3లో నలుగురు హీరోయిన్స్ తో పని చేశారు.. ఒకొక్కరి గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

మెహరీన్, తమన్నాతో ముందే పని చేశాం. ఇందులో మెహరీన్, తమన్నా కోసం డిఫరెంట్ పాత్రలు డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డే తో రెండు సినిమాలు చేశా. పూజా ఇందులో స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.

టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ వుంటుందని భావిస్తున్నారా ?

ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

యాక్షన్, రోమాన్స్, కామెడీ.. ఇలా చాలా జోనర్ సినిమాలు చేశారు కదా ,.. ఇందులో ఏది మీకు తృప్తిని ఇచ్చింది ?

అన్ని సినిమాలు, పాత్రలు తృప్తినిస్తాయి. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, .. ఇలా ఏ సినిమా చేసిన వంద శాతం ఎఫర్ట్ పెడతా. నాది అనుకునే పని చేస్తా. ప్రతి సినిమా నచ్చే చేస్తాం కదా.

ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసస్ కూడా మారింది. ఇది చాలెజింగ్ గా అనిపిస్తుందా ?

ఇప్పుడు కథల ఎంపిక మారింది. ఐతే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీ లో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.

ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?

ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ”ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్” అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు.

పర్శనల్ గా మీకు ఏ జోనర్ ఇష్టం ?

అన్ని జోనర్స్ చేయాలని వుంటుంది. యాక్షన్ సినిమాలంటే చూడటం ఇష్టం.

దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ఆయన ఫ్యామిలీ లో ఒకరిగా వుంటారు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రతి సెట్ కి వెళ్తారు. సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. ఎఫ్ 3 సెట్స్ లో ఎక్కువగా శిరీష్ గారు వుండేవారు. శిరీష్ గారు కూడా వండర్ ఫుల్ పర్శన్. ఎలాంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కరిస్తారు. వారి బ్యానర్ లో చేయడం గొప్ప అనుభవం.

సునీల్ గారి కాంబినేషన్ గురించి చెప్పండి ?

కాలేజీలో వున్నపుడు సునీల్ గారికి ఫ్యాన్ ని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన హీరో అయిన తర్వాత ఆయన టైమింగ్ ని సరిగ్గా వాడుకోలేదమో అనిపించింది. మళ్ళీ వింటేజ్ సునీల్ ని అనిల్ రావిపూడిగారు చూపించబోతున్నారు ఎఫ్ 3 లో. సునీల్ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పిరియన్స్. ఆయన టైమింగ్ అద్భుతం. ఎఫ్ 3లో మా కాంబినేషన్ హిలేరియస్ గా వుంటుంది.

ఎఫ్ 3 లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ వుందని విన్నాం ?

అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ గా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. ఇది అద్భుతంగా వుండబోతుంది.

పూజా హెగ్డేతో చేసిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి ?

చాలా మంచి పాట అది. ఐతే నాకు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ టెన్షనే. వెంకటేష్ గారికి కూడా అదే టెన్షన్. కానీ రాజసుందరం మాస్టర్ చక్కగా డిజైన్ చేశారు. సాంగ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.

ఇప్పటివరకూ మీరు చేసిన చిత్రాలలో నచ్చిన పాత్ర ?

కంచె సినిమాలో చేసిన పాత్ర మోస్ట్ మెమరబుల్. తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ పాత్రలు కూడా ఇష్టం.

ఎఫ్ 4 వుంటుందని దిల్ రాజు గారు, అనిల్ రావిపూడిగారు చెప్పారు. కథ మీరు విన్నారా ?

ఒక మూడు పాయింట్లు చెప్పారు. మూడూ హిలేరియస్ గా వున్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఎఫ్ 3 పై వుంది.

ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు సినిమా ?

ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలౌతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్ లో 70రోజులు షూటింగ్ వుంటుంది. నాన్నగారు, బీవిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు.

డబ్బు గురించి ఫస్ట్రేషన్ అయిన సంధర్భాలు ఉన్నాయా ?

చదువుకున్న రోజుల్లో వుండేది. సినిమాకి వెళ్తా అంటే నాన్న యాబై రుపాయులు ఇచ్చేవారు. అది దేనికీ సరిపోయేది కాదు. (నవ్వుతూ) లక్కీగా మంచి ఫ్రెండ్స్ వుండటం వల్ల సర్దుకునేవాళ్ళం.

డబ్బు పై మీ ఆలోచన ?

కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా ? అనిపిస్తుంది. ఐతే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది. ఎఫ్ 3లో కూడా అదే చెప్పాం. డబ్బు పట్ల జాగ్రత్తగా వుండాలి.

లబ్ డబ్ సాంగ్ లో చాలా గెటప్స్ లో కనిపించారు ?గెటప్స్ ని ఎంజాయ్ చేశారా ?

సినిమాలో చాలా గెటప్స్ వేయించారు. పోలీసు, పూజారి, రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ ఇలా చాలా గెటప్స్ వేశాం. అన్నీ చాలా సరదాగ వచ్చాయి.

మెగా ఫ్యామిలీతో మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు ?

మాకు చేయాలనే వుంటుంది. అయితే అది మా చేతిల్లో లేదు. సరైన స్క్రిప్ట్ కుదరాలి కదా.

‘మెగా ఫ్యామిలీ’ ట్రైలర్ డైలాగ్ కి మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. అంటూ వరుణ్ తేజ్ తన ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం :