
ప్రశ్న) హాయ్ సార్.. ఓ క్రికెటర్ గా అభిమానుల గుండెల్లో స్టార్ గా ఎదిగిన మీరు నటించిన మెదటి చిత్రం ‘సచిన్ టెండూల్కర్ కాదు’ ఇప్పుడు తెలుగులో విడుదలవుతుంది. ఏలా ఫీలవుతున్నారు?
స) నాకు హైదరాబాద్ తో పరిచయం ఉంది, అలాగే అక్కడ మంచి అనుభందం కూడా వుంది. హైదరాబాద్ బిర్యాని, ఇరాని ఛాయ్ అంటే చాలా ఇష్టం. నేను తెలుగు మాట్లాడలేను కాని తెలుగు అర్ధమవుతుంది. నేను, సుహసిని గారు కలిసి నటించిన సచిన్ అనే చిత్రం కన్నడలో విడుదలయ్యింది. చాలా మంచి విజయం సాధించింది. నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయ్యింది. ఇప్పడు తెలుగులో మార్చి 13న విడుదలవుతుంది. ఇలా వరుసగా బంపర్ ఆఫర్స్ వస్తుండటంతో ఆనందంగా వుంది.
ప్రశ్న) క్రికెటర్ గా ఈ చిత్రంలో నటించేటప్పుడు ఏమన్నా ఇబ్బంది ఫీలయ్యారా?
స) లేదు.. ఎందుకంటే నేను ఇందులో కూడా క్రికెట్ కోచ్ గా చేశాను. సచిన్ అనే పిల్లాడితో పాటు కొంతమంది పిల్లలకి క్రికెట్ నేర్పించే కోచ్ గా నటించాను. పెద్దగా ఇబ్బంది పడలేదు అయినా క్రికెట్ , సినిమా రంగాలు రెండు అన్నదమ్ముల లాంటివే.. కానీ అక్కడ రీ టేక్ లుండవు.. ఇక్కడ వుంటాయి అంతే తేడా. (నవ్వుతూ)..
ప్రశ్న) ఈ ప్రపోజల్ ఎవరు మీ దగ్గరికి తీసుకువచ్చారు.. మీరు ఈ స్టోరిలో ఏమి నచ్చి నటించారు.?
స) ఈ స్టోరి చెప్పింది మాత్రం డైరక్టర్ గారు. అయితే ఈ స్టోరి వినమని చెప్పింది మాత్రం సుహసిని గారు. ఈ కథ వినండి ఈ పాత్రకి మీరైతే బాగుంటుదని అనుకుంటున్నాము. విని చెప్పండి అని అన్నారు. మెయిన్ గా ఈ కథలో మానవత్వం వుంది. మానసిక పరిస్థితి సరిగ్గాలేని ఓ కుర్రాడి చివరి కోరిక క్రికెట్ ఆడాలని. అయితే ఆ కుర్రాడి కొరిక తీర్చటం కోసం అందరూ ఏవిధంగా మానవత్వంతో ఎలా సహయం చేశారనేది చిత్ర కథలో ముఖ్యాంశం. ఇదే నన్ను ఈ చిత్రంలో నటించేలా చేసింది.
ప్రశ్న) సీనియర్ నటి సుహసిని గారితో నటించటం ఏలా ఫీలవుతున్నారు.?
స) అసలే నటించంటం కొత్త, దానికి తోడు మహనటి సుహసిని గారితో కాంబినేషన్ ఇంక నా సిట్యువేషన్ ఎలా వుంటుదో ఆలోచించండి. టోటల్ బాడీ షేక్ అవుతోంది. కానీ సుహసిని గారు మాత్రం నాకు ఎలా నిలబడాలో, ఎలా డైలాగ్ చెప్పాలో, ఎలా నటించాలో చక్కగా టీచర్ లా చెప్పి చేయించారు. తను కాకుండా ఎవరైనా అయితే నేను నటించేవాడ్ని కాదు. ఈ సినిమాలో నాకంటే సుహసిని గారి పాత్ర అంటేనే ఇష్టం నాకు. థ్యాంక్స్ టు సుహసిని గారు..
ప్రశ్న) ఇక ముందు సినిమాల్లో నటిస్తారా?
స) చక్కటి కథ అంటే సోషల్ ఏవేర్‌నెస్ వున్న సబ్జెక్ట్ లు వస్తే తప్పకుండా చేస్తాను. సచిన్ లాంటి కథలతో వస్తే మారు మాట్లాడకుండా నటిస్తాను.
ప్రశ్న) ఒక పక్క మన టీం ఇండియా వాళ్ళు దూసుకెళుతున్నారు. కప్ మనదేనంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మీరేమంటారు?
స) టీం ఇండియాలో యూత్ బాగా వున్నారు. మనం ఊహించిన దానికంటే బెటర్ గా ఆడుతున్నారు. ఇదే జోరుతో వెలితే తప్పకుండా కప్పు మనదే..
ప్రశ్న) మన ఇండియా టీం కి మీరేమైనా సలహలు ఇస్తుంటారా.?
స) తప్పకుండా ఇస్తాను. సీనియర్ ఆటగాళ్ళ నుండి కుర్ర ఆటగాళ్ళ దాకా అందరూ తప్పకుండా సలహలు తీసుకోవాలి. కుర్రాళ్ళ టాలెంట్ కి మాలాంటి వాళ్ళ అనుభవం తోడయితే ఇంకా బాగుంటుంది.
ప్రశ్న) సచిన్ అనే టైటిల్ పెట్టి సినిమా చెయ్యమంటే మీరు ఇబ్బందిగా ఫీలవ్వలేదా.?
స) ఎందుకు ఇబ్బంది ఫీలవ్వాలి. ఇండియా క్రికెట్ అంటే మనకి మందు గుర్తోచ్చేది సచిన్ పేరు మాత్రమే. సచిన్ పేరుతో చేస్తున్న చిత్రంలో నటించటం గర్వంగా ఫీలవుతున్నా..

