ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ప్రదీప్ మద్దాలి- సత్యదేవ్ ఏపాత్రనైనా చేసే అద్భుత నటుడు..!

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ప్రదీప్ మద్దాలి- సత్యదేవ్ ఏపాత్రనైనా చేసే అద్భుత నటుడు..!

Published on Jul 2, 2020 5:15 PM IST

సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 47డేస్. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5లో విడుదలైన ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ మద్దాలిని ఇంటర్వ్యూ చేసి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం జరిగింది. అవేమిటో చూసేద్దాం…

47డేస్ మూవీకి వస్తున్న స్పందన ఎలా ఉంది?

ఈ చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ దక్కింది. ఐతే ఇది నా ఫస్ట్ మూవీ కావడంతో నెగెటివ్ రివ్యూలు బాగా బాధపెట్టాయి. సాధారణ ప్రేక్షకులు మాత్రం మూవీ పరవాలేదు అంటున్నారు.

మీ నేపథ్యం ఏమిటీ?
మాది రాజమండ్రి…బిటెక్ పూర్తయిన వెంటనే ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో జాబ్ రావడంతో 4 ఏళ్ళు చేశాను. తరువాత సినిమాపై మక్కువతో ఇటువైపు వచ్చేశాను. 47 డేస్ తో మూవీ చేయాలన్న కల తీరింది.

డైరెక్టర్ గా ఎలా మారారు?

నేను ఓ షార్ట్ ఫిల్మ్ తీయడగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ తరువాత డైరెక్టర్ పూరి సర్ దగ్గర పనిచేశాను. ఆ సమయంలోనే సత్యదేవ్ గారితో పరిచయం. ఇక ఈ మూవీ గత ఏడాదిలోనే విడుదల కావలసింది. కుదరలేదు, చివరకు జీ 5లో విడుదలయ్యింది.

సత్యదేవ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
సత్యదేవ్ ఓ అద్భుత నటుడు, ఎటువంటి పాత్ర నైనా చేయగలడు. ఓ షాట్ కోసం 31 గంటలు నిరవధికంగా షూటింగ్ జరిపాం. సత్యేదేవ్ గారు సహనంతో సహకరించారు.

ఈ మూవీ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
ఈ మూవీ మొదలుపెట్టిన నాటి నుండి విడుదలయ్యే వరకు ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నాను. 47 మూవీ ద్వారా నేను చేసిన మిస్టేక్స్ తెలుసుకున్నాను. నా తదుపరి చిత్రంలో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాను.

మీ భవిష్యత్ ప్రణాళికలు?
ఓ వెబ్ సిరీస్ కొరకు సంప్రదింపులు జరుగుతున్నాయి. అలాగే ఓ మూవీ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు