ఇంటర్వ్యూ: వెంకీ కుడుముల-త్రివిక్రమ్ సలహా మేరకు అలా చేశాను..!

Published on Feb 20, 2020 3:40 pm IST

నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ భీష్మ. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రేపు శివరాత్రి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు వెంకీ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు

 

హీరో నితిన్ తో సినిమా ఎలా సెట్ చేశారు?

ఛలో సినిమా తరువాత నితిన్ గారిని కలిసి కొన్ని లైన్స్ వినిపించాను. దానితో ఆయన బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చి కలవు సినిమా చేద్దాం అన్నారు. భీష్మ కథ ఆయనకు నచ్చడంతో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది.

 

తెలుగు నటులు అనేకమంది ఉండగా కన్నడ నటుడు అనంత్ నాగ్ ని తీసుకున్నారు?

ఈ చిత్రంలో ఆ పాత్ర కోసం ఓ రాయల్ పర్సనాలిటీ కావాలి అనుకున్నాను. అనంత్ నాగ్ గారి ఓ వీడియో చూసి నా పాత్రకు ఈయన చక్కగా సరిపోతారు అనిపించి, ఆయన్ని సంప్రదించడం జరిగింది. సాధారణంగా ఆయన ఇతర భాషా చిత్రాలలో నటించరు, ఐతే ఇందులో పాత్ర నచ్చి ఒప్పుకున్నారు.

 

రొమాంటిక్ లవ్ స్టోరీ లో ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు సింక్ అవుతుందా?

ఏ జోనర్ సినిమాలో అయినా ఎదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. మా చిత్రంలో ఆర్గానిక్ వ్యవసాయం అనే పాయింట్ కొంచెం సీరియస్ గా చెవుతూనే అధిక శాతం ఫన్ అండ్ రొమాంటిక్ గా నడిపించాం.

 

మళ్ళీ మీ మూవీలో హీరోయిన్ గా రశ్మికను తీసుకున్నారు, లక్కీ సెంటిమెంటా?

నేను రెండో సినిమా చేసే లోపే రష్మిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. అసలు రష్మిక ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను. కథ రాసుకునేటప్పుడు కూడా ఆమె తో కలిసి పనిచేయడం వలన ఆమె ఎక్స్ప్రెషన్స్ గుర్తుకు వచ్చేవి. అందుకే ఆమెను ఎంపిక చేయడం జరిగింది.

 

నాగ సౌర్య గారి మథర్ మీకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ ని అమ్మేశారట?

నా మొదటి సినిమాకు వచ్చిన మొదటి గిఫ్ట్ అది. దానిని నేను ఎలా అమ్ముతాను. ఇక మా పర్సనల్ విషయాలపై జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదని నా అభిప్రాయం. అందుకే ఈ విషయం వదిలేద్దాం.

 

మీ సినిమాలలో డైలాగ్స్ కొంచెం త్రివిక్రమ్ శైలి కలిగి ఉంటాయి కదా?

తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ రైటర్ త్రివిక్రమ్,అలాగే ఆయన అన్ని రకాల డైలాగ్స్ రాసివేశారు. కాబట్టి ఎవరు ఏ డైలాగ్ రాసినా త్రివిక్రమ్ గుర్తుకు రావడం సహజం. ఆయన దగ్గర పనిచేయడం వలన ఆయన ఇంపాక్ట్ నామీద ఉంది.

 

మరి త్రివిక్రమ్ గారు మీకు సలహాలేమైనా ఇచ్చారా?

సినిమా చూసి చాలా బాగా ఉంది అన్నారు. అలాగే ట్రైలర్ లోనే కథ చెప్పు, ఆడియన్స్ అందుకు ప్రిపేరై వస్తారు అని సలహా ఇచ్చారు. అందుకే సినిమా కథ ఏమిటో ట్రైలర్ లోనే చెప్పడం జరిగింది.

 

భవిష్యత్తులో చేస్తున్న సినిమాలు ఏమిటీ?

ఈ సినిమా విడుదల తరువాత ఫ్రెష్ గా కథ రాసుకొని సిద్ధం కావాలి. ఐతే మైత్రి మూవీ మేకర్స్ మరియు యూవీ క్రియేషన్స్ వారితో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం :

More