ఇంటర్వ్యూ : రాకేష్ వర్రే- రాజమౌళిగారు బాహుబలిలో నీకు అసలు పాత్రే లేదన్నారు.

Published on Oct 13, 2019 4:16 pm IST

రాకేష్ వర్రే, గార్గేయి ఎల్లాప్రగడ జంటగా దర్శకుడు శంకర్ భాను తెరకెక్కించిన చిత్రం ఎవరికీ చెప్పొద్దు. ఈనెల 8న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ చిత్ర హీరో మరియు నిర్మాత అయిన రాకేష్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు

అసలు క్యాస్ట్ గురించి మీ అభిప్రాయం ?

చదువుకొనే రోజులలో కాలేజీలో ఒక క్యాస్ట్ కి చెందిన వారు ఒక గ్రూప్ గా మారడంలో, ఇంట్లో పెద్దలు మన క్యాస్ట్ వాళ్ళని ఇంటికి పిలవమని చెప్పడం అనేవి చూశాను. నేనే మాత్రం ఈ క్యాస్ట్ సిస్టం కి విరుద్ధం.

 

మూవీకి స్పందన ఎలా ఉంది?

 

చాలా బాగుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో 90 నుండి 100 శాతం ఆక్యూపెన్సి సాధిస్తుంది. సింగల్ స్క్రీన్స్ లో మాత్రం 60 నుండి 70శాతం ఫిల్ అవుతున్నాయి. మూవీకి వచ్చిన స్పందన ఆనందం కలిగిచింది.

 

ఏ వర్గం నుండి మూవీకి మంచి ఆదరణ వస్తుంది.

ఈ మూవీని ఎక్కువ యూత్ ఆడియన్స్ ఆదరిస్తారని మేము, భావించాము. భిన్నంగా యూత్ ఆడియన్స్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారని సమాచారం.

 

మీ చిత్రానికి మీరే నిర్మాతగా మారడానికి కారణం?

 

ఈ స్క్రిప్ట్ తీసుకొని చాలా ప్రొడక్షన్ హౌసెస్ కి వెళ్లి నేను కలడం జరిగింది. కానీ నేను కొత్త వాణ్ణి కావడంతో పాటు, మూవీ కథ క్యాస్ట్ సంబంధించి. క్యాస్ట్ అనేది మనదేశంలో చాలా సున్నితమైన విషయం. అందుకే ఎవరు ఈ మూవీని నిర్మించాడనికి ఆసక్తి చూపలేదు. అందుకే నేనే ధైర్యం చేసి నిర్మాతగా మారాను.

 

ఇప్పటివరకు మీరు ఏ ఏ చిత్రాలలో నటించారు?

 

నా మొదటి చిత్రం జోష్, ఆ తరువాత వేదం, బద్రినాధ్, మిర్చి,బాహుబలి, గూఢచారి, జై లవకుశ, ఇప్పుడు ఎవరికీ చెప్పొద్దు చిత్రాలలో నటించాను.

 

చిత్రపరిశ్రమలోకి రావాలని ఎందుకు అనిపించింది?

 

చిన్నప్పటి నుండి సినిమాల పట్ల ఆకర్షణ ఉంది. చిరంజీవి గారు నాకు ఇన్సిపిరేషన్, చిన్నప్పటినుండి ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయన నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీని వందల సార్లు చూశాను. అలా ఆయన స్పూర్తితో పరిశ్రమకు రావడం జరిగింది.

 

బాహుబలి మూవీలో నటించే అవకాశం ఎలా వచ్చింది.

 

ఎప్పటినుండో రాజమౌళి మూవీలో చేయాలని ఉండేది. ఐతే నాకు వల్లి గారు, ,రామా గారితో పరిచయం ఉండటంతో వారిని కలవడం జరిగింది. బాహుబలి అప్పుడు స్క్రిప్ట్ దశలో ఉంది. ఇప్పుడే ఎదుగుతున్న నటుడివి డేట్స్ చాలా ఇవ్వాల్సి వస్తుంది, వద్దని వాళ్లు సలహా ఇచ్చారు. ఐనా మొండిగా నేను చేస్తాను అని చెప్పాను. అది ఒక పార్టు కాస్తా రెండు పార్ట్ లు, ఒక్కొక్క పార్ట్ కి రెండు సంవత్సరాలు సమయం పట్టింది.

 

బద్రినాద్ మూవీలో ప్రాధాన్యం ఉన్న విలన్ రోల్ చేసినట్టున్నారు?

వివి వినాయక్ గారు ఆ మూవీలో విలన్ కొరకు ఆడిషన్స్ జరుపుతున్నప్పుడు, అందరూ ఫొటోస్ పంపిస్తుంటే నేను ఒక వీడియో చేసి పంపించాను. దానితో వందమందికి పైగా మోడల్స్ పోటీపడ్డ ఆ పాత్ర నాకు రావడం జరిగింది. బాహుబలి కోసం కూడా మహా భారతంలోని ఓ పాత్రను తీసుకొని వీడియో చేసి పంపాను.

 

వీడియో చూసిన రాజమౌళి స్పందన ఏమిటీ?

ఆ వీడియోస్ నేను రామా గారికి మరియు వల్లీ గారికి పంపేవాడిని, రాజమౌళి అవి చూశారా లేదో అనుకొనే వాడిని . ఆ వీడియో చూసిన రాజమౌళి, ఈ చిత్రంలో పాత్రలు మాస్ గా ఉంటాయి,నీవేమో సాఫ్ట్ గా ఉన్నావు. నీకు బాహుబలిలో పాత్రే లేదు అన్నారు. కానీ నా ఇంట్రెస్ట్ చూసి బాహుబలిలో సేతుపతి పాత్రను కొత్తగా క్రియేట్ చేశారు.

 

భవిష్యత్తులో విలన్ గా చేస్తారా లేక హీరోగానే కొనసాగుతారా ?

ఖచ్చితంగా విలన్ గా అవకాశం వస్తే చేస్తాను. ఎందుకంటే నేను చిత్ర పరిశ్రమకు పరిచయమైంది విలన్ గానే. కాబట్టి మంచి విలన్ రోల్స్ వస్తే చేస్తాను.

 

హీరోగా ఏమైనా కొత్త చిత్రాలకు కమిట్ అయ్యారా?

లేదు, ఈ మూవీకి నేనే ప్రొడ్యూసర్ ని కాబట్టి విడుదలయ్యాక చూద్దాం

సంబంధిత సమాచారం :

X
More