ఇంటర్వ్యూ: సాయి ధరమ్ తేజ్- వరుణ్, నేను కథ కోసం వెయిటింగ్..!

ఇంటర్వ్యూ: సాయి ధరమ్ తేజ్- వరుణ్, నేను కథ కోసం వెయిటింగ్..!

Published on Dec 18, 2019 3:53 PM IST

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండుగే. పల్లెటూరి నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ధరమ్ తేజ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

ప్రతిరోజూ పండుగే చిత్రం ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నారు?

జీవిత చరమాంకంలో ఉన్న ఒక వ్యక్తి కి తన కుటుంబం ఇచ్చే బహుమతి ఎలా ఉండాలి. కొద్దిరోజులలో చనిపోతాడు అని తెలిసిన వ్యక్తి చావుని కూడా పండుగగా ఎలా ముగించవచ్చు అనే విషయాలను ఫన్ అండ్ ఎమోషనల్ గా చెప్పాము.ఒక ఉగాది పచ్చడిలాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.

 

ఈ చిత్రంలో శతమానం భవతి చిత్ర పోలికలు ఉంటాయా?
శతమానం భవతి కి మా సినిమాకు ఎటువంటి సంబంధం ఉండవు. మాది సెపెరేట్ స్టోరీ.

 

మీ పాత్ర ఎలా ఉంటుంది?
తన తాత గారి పరిస్థితి తెలుసుకొని విలేజ్ కొచ్చిన మనవడి పాత్ర నాది. కొద్దిరోజులలో చచ్చిపోయే తన తాత సంతోషం కోసం తపించే కుర్రాడిలా ఉంటాను. ఫన్, ఎమోషన్స్ మరియు యాక్షన్ ఇవ్వన్నీ కలగలిసిన పాత్ర నాది.

 

ఈ మూవీలో సిక్స్ ప్యాక్ చేసినట్టున్నారు., కథలో భాగమేనా?

నా మొదటి చిత్రం కోసం కూడా నేను సిక్స్ ప్యాక్ చేశాను. చిత్రలహరి మూవీ కోసం కొంచెం వెయిట్ పెరిగాను. అది తగ్గించడం కోసం వ్యాయామం చేయడం జరిగింది. అలాగే ఈ మూవీలో నాకు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అందుకే సిక్స్ ప్యాక్ చేయడం జరిగింది.

 

మారుతీ గారితో ఈ మూవీ ఎలా సెట్ అయ్యింది?

నేను 2007లో ఎం బి ఏ చదివేటప్పుడు మారుతీ, ఎస్ కె ఎన్, బన్నీవాసు గారితో నాకు పరిచయం ఉంది. అప్పుడు మారుతీ నాకు ఓ కథ వినిపించారు. మేమిద్దరం ఎప్పటి నుండో ఒక మూవీ చేయాలనుకుంటున్నాం, ఇప్పటికి ఈ కథతో అది కుదిరింది.

 

థమన్ గురించి చెప్పండి?

థమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా మంచి మిత్రుడు అని చెప్పాలి, మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ గతంలో కూడా హిట్ అయ్యాయి. ఈ మూవీ కొరకు థమన్ ఇచ్చిన పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

 

ఒక పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చారు అది మీకు, బలమా.. బలహీనత?

అది ఒక బాధ్యత.. అని నా ఫీలింగ్. మెగాస్టార్ లాంటి కుటుంబం నుండి వచ్చినప్పుడు మనం చేసే సినిమాలు, నిర్ణయాలు వారు సెట్ చేసిన బెంచ్ మార్క్ అందుకునేలా ఉండాలి.

 

సత్య రాజ్ గారి గురించి చెప్పండి ?

సత్య రాజ్ గారు ఒక జీనియస్, ఆయనకు ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఆయన ఒక సారి చెవుతూ ”రెండేళ్లు నేను మేక్ అప్ వేసుకోలేదు, అయినా నేను విశ్వాసం కోల్పోలేదు. పొలిటికల్ రౌడీ చిత్రంతో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది” అని చెప్పారు. అయన దగ్గర పనిచేసే వారి దగ్గర నుండి సెట్ లో ఉన్న అందరినీ ఆయన గౌరవిస్తారు. ఆయన మాటలు స్ఫూర్తి నింపుతాయి.

 

తమిళ్ లో ఏమైనా సినిమాలు చేస్తున్నారు ?

నిజానికి నాకు తమిళ్ కూడా వచ్చు. కానీ ఇప్పుడే కాదు, దానికి ఇంకా టైం ఉంది.

 

 

సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఎంతవరకు వచ్చింది ?

3 డేస్ చిన్న షెడ్యూల్ చేశాం, ప్రతిరోజూ పండుగే విడుదల తరువాత వన్ వీక్ లో మరలా షూటింగ్ స్టార్ట్ చేస్తాం.

 

మెగా హీరోలతో మల్టీ స్టారర్ ఏమైనా చేస్తున్నారా?

అవును వరుణ్, నేను కథ కోసం వైటింగ్. ఇప్పటికే ఈ విషయంపై మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. సరైన కథ దొరికితే చేయడానికి మేము సిద్ధం, రవి తేజ గారు కూడా మల్టీ స్టారర్ చేద్దాం అని అడిగారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు