ఇంటర్వ్యూ: శర్వానంద్- అక్షయ్ కుమార్ ఫార్ములా ఫాలో అవుతున్నాను.

Published on Feb 8, 2020 11:04 am IST

శర్వానంద్ సమంత జంటగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ జాను. దిల్ రాజు నిర్మాత తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంధర్భంగా హీరో శర్వానంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…

96 లాంటి క్లాసిక్ ని రీమేక్ చేయడానికి ధైర్యం కావాలి మీరు ఎలా ఒప్పుకున్నారు?
నాకు నిర్మాత రాజు గారి మీద నమ్మకం, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పుకాదని. మొదట్లో నేను చేయనని చెప్పాను. ఐతే నో ప్రాబ్లం ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని ఆయన చెప్పి ఒప్పించారు.

ఇలాంటి ఛాలెంజిగ్ రోల్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది?
చాల భయం వేసేది, కొంచెం అటూ ఇటూ ఐతే ట్రోల్స్ చేస్తారు, ఓ ప్రక్క గ్రేట్ పరఫార్మర్ సమంత ఉన్నారు, మరో ప్రక్క కంపారిజాన్స్ వస్తాయి. అందుకే చాలా భయం వేసేది.

ఒరిజినల్ 96 మూవీ చూశారా?
చూశాను, సినిమా చూసిన వెంటనే నాకు ఇది క్లాసిక్ అని అర్థం అయిపోయింది. దానిని చెడగొట్ట కూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను.

ఇండస్ట్రీ నుండి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటీ?
ఇది రీమేక్ లా లేదు, ఓ ఫ్రెష్ ఫిల్మ్ లా ఉంది. త్రిష, విజయ్ సేతుపతి గుర్తుకు రాలేదు అన్నారు. అదే మాకు వచ్చిన బెస్ట్ ఫీడ్ బ్యాక్, దానితో నేను చాలా హ్యాపీ గా ఫీలయ్యాను.

ఈ సినిమా చేయడానికి కారణం?
నిర్మాత రాజు గారి మీద నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది, ఆయన కాకుండా మరొకరైతే నేను ఈ సినిమా చేసేవాడని కాదు. సెకండ్ హాఫ్ మొత్తం రెండు పాత్రలపై నిలబెట్టడం చాలా ఛాలెంజ్, అది దర్శకుడు చక్కగా చేశాడు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ నే కాదు, రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాం అంటే ఎంటర్టైన్ చేసినట్టే.

జాను తో మరో హిట్ మీ ఖాతాలో వేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది?
హిట్స్ చాల కొట్టొచ్చు కానీ, ఎప్పటికీ గుర్తు పెట్టుకొనే సినిమాలు కొన్ని ఉంటాయి, ప్రస్థానం, గమ్యం, ఇప్పుడు జాను నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాలు.

రీమేక్స్ చేయడంపై మీ అభిప్రాయం?
రీమేక్ చేయాలంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది క్లాసిక్స్ అంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ మరియు భయంవేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ లో చేసిన యాక్టర్ తో పోలికలు ఉంటాయి.

వేగంగా సినిమాలు చేస్తున్నట్లున్నారు?
అక్షయ్ కుమార్ ఫార్ములా ఫాలో అవుతున్నాను. మూడు విడుదల అవ్వాలి మూడు సెట్స్ పైన ఉండాలి. బైలింగ్వల్ మూవీస్ అంటే గతంలో జర్నీ చేశాను.

శ్రీకారం లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది.

సంబంధిత సమాచారం :