ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు-ఆ చిత్రాలకు రెమ్యూనరేషన్ పెంచమని అడుగలేదు .

ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు-ఆ చిత్రాలకు రెమ్యూనరేషన్ పెంచమని అడుగలేదు .

Published on Nov 6, 2019 2:25 PM IST

శ్రీవిష్ణు నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తిప్పరా మీసం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

టైటిల్ తో పాటు మీ అప్పీరెన్స్ కూడా మాస్ గా కనిపిస్తుంది, మీ పాత్ర ఎలా ఉంటుంది?

మాస్ అంటే మాస్ హీరోలా భారీ డైలాగ్స్ , ఫైట్స్ అలా ఉండవు. నైట్ క్లబ్ లో పనిచేసే ఆట్టిట్యూడ్ కలిగిన వాడిలా నా పాత్ర స్వభావం ఉంటుంది.

 

తిప్పరా మీసం టైటిల్ వెనుక ఆంతర్యం ఏమిటీ?

మీసం అనేది ఒక భాద్యత అని అర్థం. పూర్వకాలంలో రాజులు మీసాలు బాగా పెంచేవారు. అంటే పాలకులుగా వారికి చాలా భాద్యత ఉందని అర్థం.అలాగే ఒక మగాడిగా, వ్యక్తిగా తన బాధ్యతను తాను నెరవేర్చాలి. అప్పుడు అందరిముందు గర్వంగా మీసం తిప్పుతాం. ఆ పాయింట్ ఆధారంగా ఈ మూవీకి తిప్పారా మీసం టైటిల్ పెట్టడం జరిగింది.

 

ఈ మూవీ బాగా ఆలస్యం ఐనట్టుంది ?

బ్రోచేవారెవరురా మూవీ జూన్ లో వచ్చింది. వెంటనే మరో మూవీ విడుదల చేయడం ఎందుకు అనే ఆలోచనతో పాటు, సాహో, సైరా వంటి పెద్ద చిత్రాల విడుదల కూడా ఉండటంతో రిలీజ్ ఆపడం జరిగింది. ప్రొడక్షన్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న టైంకే పూర్తయ్యాయి.

 

దర్శకుడు కృష్ణ విజయ్ మీతోనే చేయడానికి కారణం?

మా అసోసియేషన్ బాగా సెట్ ఐయ్యింది. అందుకే ఆయన నాతో సినిమాలు చేస్తున్నారు. నేను టైం కి సెట్ కి వెళతాను, అలాగే చెప్పింది చేస్తాను అందుకే కృష్ణ విజయ్ నాతో కంపార్ట్ గా ఫీలవుతున్నారేమో. నాతోనే ఆయన సినిమాలు చేయాలనుకోవడం నాకు హ్యాపీగా ఉంది.

 

‘బ్రోచేవారెవరురా’ సినిమా తరువాత రెమ్యూనరేషన్ పెంచారా?

బ్రోచేవారెవరురా మూవీకి ముందే నేను నాలుగు ప్రాజెక్ట్స్ కమిట్ ఐయ్యాను. కాబట్టి ఆ చిత్రాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచమని అడుగలేదు. ఇకపై చేసే చిత్రాలకు పెంచుతానేమో .

 

ఈ మూవీని ఎంచుకోవడానికి కారణం ?

మదర్ సెంటిమెంట్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ కలిగిన కథ ఇది. హీరో పాత్ర సరికొత్త ఆట్టిట్యూడ్ కలిగి భిన్నంగా ఉంటుంది. అలాగే సినిమాలో నా చర్యలు నువ్వుకూడా తెప్పించేవిగా ఉంటాయి.

 

సీనియర్ నటి రోహిణి గారితో కలిసిన నటించిన అనుభం ఎలా ఉంది?

ఆమె ఒక్క టేక్ లో చాలా ఫాస్ట్ గా చేశేస్తారు. సీనియర్ అని మొదటి కొంచెం భయం వేసింది. ఐతే ఆమెతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం మొత్తం పోయింది. నేను ఇప్పటివరకూ కలిసి పనిచేసిన నటులలో ఆమె బెస్ట్ అని చెప్పగలను. ఆమె నా మదర్ పాత్ర చేశారు.

 

బ్రోచేవారెవరురా మూవీ తరువాత ఈ చిత్రంలో ఏమైనా మార్పులు చేశారా?

అలా ఏమి లేదండి. తిప్పరా మీసంలో ఎటువంటి మార్పులు చేయలేదు.

 

కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయా?

కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే తొడకొట్టడాలు, మీసం తిప్పడాలు అలా ఆ కోణంలో కాదు, రియలిస్టిక్ గా ఎక్కువమందికి చేరే అంశాలు ఈ మూవీలో ఉన్నాయి.

 

భవిష్యత్తులో ఏమి చిత్రాలు చేస్తున్నారు?

మూడు చిత్రాల వరకు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్స్ ఫైనల్ కావడం జరిగింది. ఐతే ఏది ముందు మొదలవుతుంది అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు